గీతం విశ్వవిద్యాలయంలో ముగిసిన జాతీయ మూట్ కోర్టు పోటీలు: విజేతగా సింబయాసిస్
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం జిల్లా సాగర్నగర్లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో మూడు రోజులుగా నిర్వహించిన జాతీయస్థాయి మూట్ కోర్టు పోటీలు ఘనంగా ముగిశాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు తెలిపారు. దేశవ్యాప్తంగా ముప్పై నాలుగు న్యాయకళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీల్లో పుణెకు చెందిన సింబయాసిస్ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు విజేతలుగా నిలిచి టైటిల్ను కైవసం చేసుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు. భోపాల్ న్యాయ విశ్వవిద్యాలయం ద్వితీయస్థానాన్ని దక్కించుకుందని వారు పేర్కొన్నారు.