పోలీస్ కొలువుల్లో ట్రాన్స్‌జెండర్లకు అవకాశంపై హైకోర్టు కీలక ఆదేశాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో ట్రాన్స్‌జెండర్లకు చోటు కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో విచారణ జరిగింది. దరఖాస్తులలో ‘ఇతరులు’ కాలమ్ ఎందుకు చేర్చలేదని ప్రభుత్వం, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డును ధర్మాసనం ప్రశ్నించింది. మూస ధోరణి మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో ఆప్షన్ లేకపోతే ట్రాన్స్‌జెండర్ల నుంచి భౌతికంగా దరఖాస్తులు స్వీకరించి రశీదు అందజేయాలని ఆదేశిస్తూ, విచారణను సెప్టెంబర్ 16కి వాయిదా వేసింది.