రామతీర్థంలో ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహావిష్కరణ
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా రామతీర్థంలో నూతనంగా ప్రతిష్టించిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి ఆవిష్కరించారు. వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఇకపై నేరుగా ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని స్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.