వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు తత్వం సినిమా: హీరో దినేష్ తేజ్

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

అర్జున్ కోలా దర్శకత్వంలో తెరకెక్కిన తత్వం సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయని, ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అందరినీ అలరిస్తుందని హీరో దినేష్ తేజ్ స్పష్టం చేశారు. మూఢనమ్మకాలకు, నమ్మకానికి మధ్య జరిగే కథతో ఈ చిత్రం రూపొందిందని ఆయన తెలిపారు. రేపు ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పాత్రికేయులతో మాట్లాడిన ఆయన, చిత్ర విశేషాలను పంచుకున్నారు.