గుంటూరు విద్యార్థిని కిడ్నాప్ కేసు: హర్యానాలో నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: గోపి
స్థలం: గుంటూరు
గుంటూరులో టెన్త్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి, పోలీసులకు సవాల్ విసిరిన షేక్ జాన్ సైదాను హర్యానాలోని కర్నాల్‌లో సిట్ బృందం అరెస్ట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై, బాలికను మభ్యపెట్టి తీసుకెళ్లిన నిందితుడు మూడు నెలలుగా పలు రాష్ట్రాలు మారుతూ తప్పించుకున్నాడు. 'దమ్ముంటే పట్టుకోండి' అని పోలీసులకు సవాల్ విసిరిన నిందితుడిని సాంకేతిక ఆధారాలతో పట్టుకుని ఏపీకి తరలిస్తున్నారు.