నా బ్లడ్ బ్యాంక్ పై అసత్య ప్రచారాలు చేయడం బాధాకరం అంటూ చిరంజీవి ఆవేదన

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్‌పై వస్తున్న ఆరోపణలపై మెగా యూత్ ఫోర్స్ అభిమానుల సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సేవా కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం చేయడం తనను తీవ్రంగా బాధిస్తోందని, రక్తాన్ని విక్రయిస్తున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అర్థరహితమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి విరాళాలు ఆశించకుండా సొంత సంపాదనతోనే బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.