కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం: కనిపించకుండా పోయిన ట్రాన్స్జెండర్ మృతి

రిపోర్టర్: హరి స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీంగూడ ఔటర్ రింగ్ రోడ్డు అండర్ పాస్ వద్ద ఓ ట్రాన్స్ జెండర్ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం కనిపించడం లేదంటూ తండ్రి ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టామన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామని, ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.