తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచలనం: వణుకుతున్న ఎలుగుకొండ గ్రామస్థులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తూర్పుగోదావరి జిల్లా
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం ఎలుగుకొండ గ్రామ సరిహద్దుల్లో పులి సంచరిస్తోందని స్థానికులు తెలిపారు. పొలాలు, జనావాసాల సమీపంలో పులి అడుగులను గుర్తించిన గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అటవీ శాఖాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.