తెలంగాణలో ఉడాన్ కార్యక్రమం అమలుకు టాస్క్ డెల్ అవగాహన ఒప్పందం
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ బ్యూరో
తెలంగాణ యువతను భవిష్యత్ సాంకేతిక రంగాలకు సిద్ధం చేసే లక్ష్యంతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్, డెల్ టెక్నాలజీస్ కలిసి ఉడాన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేయనున్నాయి. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా 25 శిక్షణా కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు మూడు నెలలపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శిక్షణ అందించనున్నారు.