రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం వరం: ఎస్పీ శ్రీనివాస రావు

రిపోర్టర్: వెంకట్ స్థలం: జోగులాంబ గద్వాల

రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం ఎంతో వరం లాంటిదని, అర్హులైన వారందరూ ఈ సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ జోగులాంబ గద్వాల (SP Jogulamba Gadwal) శ్రీ టి శ్రీనివాస రావు స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా ప్రమాద బాధితులకు రూపాయి లక్షా యాభై వేల వరకు నగదు రహిత వైద్య చికిత్స ఉచితంగా లభిస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ వివరాలు వెల్లడించారు.