మహాదేవ్ బెట్టింగ్ యాప్ సహ వ్యవస్థాపకుడు రవి ఉప్పల్ అరెస్ట్
రిపోర్టర్: అశోక్
స్థలం: Dubai
మహాదేవ్ బెట్టింగ్ యాప్ సహ వ్యవస్థాపకుడు రవి ఉప్పల్ దుబాయ్ లో అరెస్టయ్యారని వర్గాలు వెల్లడించాయి. ఆయన భాగస్వామి సౌరభ్ చంద్రాకర్ ఒమన్ నుండి భారత్ కు రప్పించిన వారం రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈడీ, సీబీఐ అధికారులు ఉప్పల్ ను త్వరలోనే భారత్ కు రప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. వందల కోట్ల హవాలా నెట్ వర్క్ నిర్వహణలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.