ఏపీలో రూ.22,351 కోట్ల భారీ పరిశ్రమల ప్రతిపాదనలకు కసరత్తు

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో రూ.22,351.15 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ పరిశీలించింది. నంద్యాల జిల్లా మిడ్తూరులో రూ.168.56 కోట్లతో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సాయి బయోఎనర్జీ ప్రతిపాదించింది. దీని ద్వారా 600 మందికి ఉపాధి లభించనుంది. విద్యుత్, ఐటీ, ఫుడ్‌ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖల ద్వారా భారీగా పెట్టుబడులు రానున్నాయి.