మనుబోలు మండలంలో దారుణం: రామాలయంలో అర్ధరాత్రి చోరీ, తాళిబొట్లు అపహరణ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మనుబోలు

మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ నాయుడుపల్లి గ్రామంలోని రామాలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు సుమారు రెండు లక్షల రూపాయల విలువైన అమ్మవారి తాళిబొట్లు అపహరించుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై గ్రామస్థుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.