మందోళ్లగూడెంలో వేడుకగా విజయదశమి సంబరాలు నిర్వహించిన గ్రామస్థులు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెంలో విజయదశమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సూర్కంటి శ్రీధర్ రెడ్డి కాషాయ జెండా ఆవిష్కరించారు. అనంతరం శమి వృక్షానికి ప్రత్యేక పూజలు చేసి గ్రామస్థులు ఒకరికొకరు జమ్మి ఆకులు ఇచ్చుకున్నారు.