వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి బెదిరింపు వ్యవహారం: దర్యాప్తు అధికారి మార్పు

రిపోర్టర్: రమేష్ స్థలం: কడప

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని కడప జైలులో బెదిరించిన కేసు విచారణ బాధ్యతలను జైళ్ల శాఖ కడప రేంజ్ డీఐజీ రాజేశ్వరరావుకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ బాధ్యతలు నిర్వర్తించిన డీఐజీ రవికిరణ్ను అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం తప్పించింది. వైద్య శిబిరం ముసుగులో నిబంధనలు ఉల్లంఘించి జైలులోకి వెళ్లి దస్తగిరిని బెదిరించిన ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.