స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానం: విజయనగరం జిల్లాకు దక్కిన ప్రతిష్ఠాత్మక గుర్తింపు
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, రాజాం పురపాలక సంఘాలు ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌కు ఎంపికయ్యాయని అధికారులు తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులను స్వీకరించారు. జిల్లాకు చెందిన పురపాలక సంఘాలు ఈ ఘనత సాధించడంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ విజేతలను అభినందించారు.