వినాయక చవితి కానుకగా 'ఫీల్ మై లవ్' స్పెషల్ పోస్టర్

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఫీల్ మై లవ్' నుంచి మేకర్స్ వినాయక చవితి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. హరి ప్రకాష్ ఎం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.