'ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు': మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: తమిళనాడు
ఎన్నికైన వెంటనే రాజకీయ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి బరిలో నిలవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం మండిపడింది. తమిళనాడులో టీవీకే పార్టీ తరఫున మధురాంతకం, ధారాపురం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న మరగతం కుమారవేల్, పి. సత్యభామల రాజీనామాలపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్.ఎం. సుబ్రమణియం, జస్టిస్ కె. గోవిందరాజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి అనైతిక పద్ధతులను అరికట్టడానికి తగిన మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది.