ట్రాయ్ సరికొత్త నిబంధనలు స్పామ్ కాల్స్ కు చెక్

రిపోర్టర్: విజయ్ స్థలం: India

టెలికం రంగంలో అవాంఛిత వాణిజ్య కాల్స్ మరియు స్పామ్ సందేశాలను అరికట్టేందుకు ట్రాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. టెలికం ఆపరేటర్లు స్పామ్ కార్యకలాపాలకు పాల్పడే నంబర్లను గుర్తించి సమాచారాన్ని పంచుకోవాలని ఆదేశించింది. ఆటోమేటెడ్ వాణిజ్య కాల్స్ పై కఠిన నిబంధనలు విధించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తే నంబర్ల రద్దు లేదా కేవైసీ పునఃపరిశీలన వంటి కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.