రబీ సాగు విస్తీర్ణం పెంచాలి: అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో రబీ సీజన్లో సాగు విస్తీర్ణం పెంచేందుకు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు. భూములను ఖాళీగా ఉంచకుండా రెండో పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో పండించే పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.