ది ప్యారడైజ్ ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్‌ను కోరిన నాని
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ఓ థియేటర్‌లో తన తాజా సినిమా ది ప్యారడైజ్ ప్రీమియర్ షోను వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రముఖ కథానాయకుడు నాని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకుల స్పందనను ప్రత్యక్షంగా చూడాలనే కోరిక ఉందని, ప్రభుత్వం సూచించిన అన్ని భద్రతా నిబంధనలను పాటిస్తామని ఆయన ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.