వసతులు లేక అల్లాడుతున్న అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారులు

రిపోర్టర్: నరేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

కావలి, చిల్లకూరు, కోవూరు, ఆత్మకూరు ప్రాంతాల్లోని అనేక అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె మరియు శిథిలావస్థ భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రహరీలు, మరుగుదొడ్లు, గాలి వెలుతురు లేకపోవడంతో పాటు రేకుల షెడ్ల కింద నిర్వహిస్తుండటంతో ఎండ వేడిమికి చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.