స్మృతి మంధాన సూపర్‌ సెంచరీ.. హాంగ్‌కాంగ్ ముందు భారీ లక్ష్యం!

రిపోర్టర్: నరేష్ స్థలం: India

మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్‌ వేదికగా హాంగ్‌కాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన (124 పరుగులు, 64 బంతుల్లో) అద్భుతమైన శతకంతో చెలరేగింది. ఆమె తనదైన శైలిలో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడి టీ20 కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేసింది. మిగతా బ్యాటర్లు విఫలమైనప్పటికీ, స్మృతి సునామీ ఇన్నింగ్స్‌తో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు భారీ స్కోరు సాధించి, హాంగ్‌కాంగ్ ముందు 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.