జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న ఏపీ జీఎస్ టీ ఏఐ విధానం

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

ఏపీ వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న కృత్రిమ మేధస్సు ఆధారిత జీఎస్టీ పరిపాలన విధానం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సమన్వయ సమావేశంలో ఈ మోడల్పై ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇవ్వగా, కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు దీనిని ప్రశంసించారు. పన్ను ఎగవేతను గుర్తించడం, రిటర్నుల పరిశీలన వంటి ప్రక్రియలను ఈ విధానం మరింత సమర్థవంతంగా మారుస్తోందని అధికారులు స్పష్టం చేశారు.