పెట్టుబడుల ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతా: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రిపోర్టర్: హరి
స్థలం: విశాఖపట్నం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఎస్క్రో ఖాతా ద్వారా రాయితీలు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దిల్లీలో జరిగిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడారు. విశాఖలో నవంబర్లో జరిగే సదస్సులోనే ఈ ఖాతాను ప్రారంభిస్తామని తెలిపారు. పరిపాలనలో కృత్రిమ మేధస్సును జోడించి సేవలను వేగవంతం చేస్తున్నామని, అమరావతిని గ్లోబల్ టెక్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.