బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిమాండ్ తిరస్కరించిన నాంపల్లి కోర్టు
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. వారి రిమాండ్‌ను తిరస్కరించిన కోర్టు, రూ.10 వేల పూచీకత్తు, రెండు షూరిటీలతో వారిని విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది.