తెలుగుదేశం నేత రఘునాథరెడ్డి అంత్యక్రియల్లో ఎమ్మెల్యే సురేష్ నివాళి

రిపోర్టర్: సురేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి తుది వీడ్కోలు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని నివాళులర్పించారు. రఘునాథరెడ్డి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీకి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.