తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు: డాక్టర్ శ్రీధర్‌రెడ్డి పిలుపు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ సూర్కంటి శ్రీధర్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని ఆరాధించే ఈ విశిష్ట పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయతకు, ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. మన సంస్కృతిని కాపాడుతూ పండుగను ఘనంగా జరుపుకోవాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.