నర్సీపట్నం ఎన్నికల వేళ రౌడీషీటర్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు టౌన్ పోలీసులు రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పార్టీల ఘర్షణలకు దూరంగా ఉండి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయకుండా ఉండాలని స్పష్టం చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.