సోషల్ మీడియా పోస్ట్‌తో రూ. పద్దెనిమిది లక్షల అప్పు నుంచి బయటపడిన హోటల్
రిపోర్టర్: వెంకట్
స్థలం: Mumbai
ముంబైలోని చెంబూర్‌లో దిల్ సే రెస్టారెంట్‌ను ప్రారంభించిన సోదరులు జస్ సింగ్ ఖల్సా మరియు మహీందర్ సింగ్ ఖల్సా భారీ అప్పుల పాలై మూసివేత దశకు చేరుకున్నారు. కమెడియన్ అభిషేక్ ఉప్మను మరియు బాలీవుడ్ నటి అనుష్క శర్మ సోషల్ మీడియాలో చేసిన ప్రశంసల పోస్టులు ఈ చిన్న హోటల్ రాతను మార్చేశాయని యజమానులు తెలిపారు. విరాట్ కోహ్లీ కోసం తెప్పించిన చోలే భటూరే ఆర్డర్ వైరల్ కావడంతో కస్టమర్లు పోటెత్తారని వారు ఆనందం వ్యక్తం చేశారు.