భారత ప్రగతికి ప్రధాని మోదీ దార్శనికత అద్భుతం

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేసిన అనుభవాలపై నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ రాసిన వ్యాసం ఎంతో స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పెద్ద కలలు కంటూ దేశ అభివృద్ధికి మోదీ ఎంతో దూరచూపుతో అడుగులు వేశారని, ఆయన నాయకత్వ శైలి దేశ ప్రగతిని కొత్త దిశకు తీసుకెళ్లిందని అమితాబ్ కాంత్ తన వ్యాసంలో వివరించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.