వర్ధన్నపేటలో వేడుకగా గణేశ్ నిమజ్జనం ఉత్సాహంగా ఉట్టి కొట్టే పోటీలు

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట పట్టణంలో ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో గణనాథుని నిమజ్జనోత్సవం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ ఉట్టి కొట్టే పోటీలను కౌన్సిలర్ తిరుపెల్లి వాణి- కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పర్యావరణహిత మట్టి వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేయడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణపై యువతకు మంచి సందేశం అందించినట్లు నిర్వాహకులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.