ప్రభాస్ ఫౌజీ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవి శంకర్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఫౌజీ విడుదలపై నిర్మాత రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు. సినిమా అవుట్‌పుట్ అత్యుత్తమంగా రావడానికి కొంత సమయం పడుతుందని, అనుకున్నదానికంటే కొద్దిగా ఆలస్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ఆయన తెలిపారు. బాహుబలి తర్వాత ప్రభాస్ అంతటి గ్రాండ్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో ఈ సినిమాలో కనిపిస్తారని వెల్లడించారు.