మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో కోతలపై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోతలు విధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్ 1181 కార్మిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నింపిందని మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. దశాబ్దాలుగా సేవలందిస్తున్న వేలాది మంది కార్మికుల పొట్టకొట్టేలా ఉన్న ఈ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, పాత వేతనాలను పునరుద్ధరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనబాట పడుతామని కార్మిక సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి.