ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఆంధ్రప్రదేశ్
తెలంగాణ నుంచి తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో బుధవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకస్మిక వర్షాలు, పిడుగుల ప్రమాదం దృష్ట్యా ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.