'తెలంగాణ కోసం పోరాడిన యోధుల సేవలు మరువలేం': బాలానగర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి
రిపోర్టర్: మహేష్
స్థలం: మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. బాలానగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ గుమ్మల వెంకటేశ్వర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ కోసం పోరాడిన యోధుల సేవలను ఈ సందర్భంగా ఘనంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి, టీపీసీసీ సమన్వయకర్త దత్తాత్రేయ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.