ఎన్నికలు జరగకుండా చేయాలంటూ వైకాపా కుట్ర: ఎమ్మెల్యే బొండా ఉమ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయవాడ
ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడమే వైకాపా ప్రధాన కుట్ర అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ ఆరోపించారు. అభ్యర్థుల చేతిలో నామినేషన్ పత్రాలు లాక్కుని చించివేశారని ఆయన మండిపడ్డారు. పుంగనూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైకాపా వర్గాలు పెద్దఎత్తున విధ్వంసానికి పాల్పడ్డాయని విమర్శించారు. గతంలో బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవాలు చేసుకున్న చరిత్ర ఆ పార్టీదని విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో బొండా ఉమ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.