సిక్కింలో భారీ కొండచరియలు విరిగిపడి ధ్వంసమైన ఇండ్లు

రిపోర్టర్: శివ స్థలం: Sikkim

సిక్కిం రాష్ట్రంలోని గల్సింగ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రింబి గ్రామంలో తీవ్ర నష్టం సంభవించింది. పలు ఇండ్లు, ప్రభుత్వ భవనాలు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ స్వయంగా సమీక్షిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.