ఖమ్మంలో గిరిజన యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్న ఐటీడీఏ
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం రోటరీ నగర్లోని సంక్రాంతి వంశీ కాంప్లెక్స్ కేంద్రంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగ యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఇన్చార్జి ప్రసన్న, ఫ్యాకల్టీ రమాదేవి తెలిపారు. అర్హులైన యువతను కేంద్రానికి పంపించాలని కోరుతూ సీనియర్ నేత ఏనుగు గాంధీని కలిసి వారు శిక్షణ వివరాలను పూర్తిగా వివరించారు.