కొఠియా వివాదం: అభ్యర్థులను కిడ్నాప్ చేసి బంధించిన ఒడిశా పోలీసులు

రిపోర్టర్: సునీల్ స్థలం: సాలూరు

కొఠియా వివాదాస్పద ప్రాంతంలో ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో కొఠియా ప్రాదేశిక అభ్యర్థులను సివిల్ దుస్తుల్ లో వచ్చిన ఒడిశా పోలీసులు బలవంతంగా వ్యాన్లలో ఎక్కించుకుని తీసుకెళ్లారని తెదేపా అభ్యర్థి తాడంగి చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. తమ చరవానులు లాక్కుని మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్ లోని లాడ్జిలలో బంధించి, ఎన్నికలు ముగిసిన తర్వాతే తమను గ్రామాల్ లో విడిచిపెట్టారని బాధితులు వాపోయారు.