ధారాశివ్లో దారుణం: కట్న వేధింపులతో ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్య
రిపోర్టర్: కిరణ్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని ధారాశివ్ నల్దుర్గ్ కోటలో దారుణం జరిగింది. కట్న వేధింపులు, ఆడపిల్లలకు జన్మనిచ్చారనే వివక్షతో అశ్విని అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి కోట పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా, మరో చిన్నారి చికిత్స పొందుతోంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త మనోహర్ పోల్, అత్తమామలు, బంధువులపై కట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేశారు.