మణిపూర్ లో ఘోరం: గోనె సంచుల్ లో కుకీ యువకుల మృతదేహాలు లభ్యం

రిపోర్టర్: నరేష్ స్థలం: Kangpokpi

మణిపూర్ రాష్ట్రంలోని కాంగ్పోక్పి జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు కుకీ జో యువకుల మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయని పోలీసులు తెలిపారు. టఫౌ కుకీ గ్రామానికి చెందిన టింగిన్లున్ చాంగ్లాయ్, పాగిన్లాల్ హాంగ్షింగ్ మృతదేహాలను అరటి తోటలోని గోనె సంచుల్ లో కనుగొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ గిరిజన సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి.