హోటల్ గదిలో యువతి హత్య, ప్రియుడు అరెస్ట్

రిపోర్టర్: సతీష్ స్థలం: అస్సాం

అస్సాంలోని కామరూప్ జిల్లా రంగియా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రియురాలిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. చెన్నై నుంచి వచ్చిన మలానీ గురియాను ఆమె ప్రియుడు అభిజిత్ కిందు హోటల్ గదిలో హతమార్చాడు. వ్యక్తిగత వివాదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడే స్వయంగా పోలీసులకు సమాచారం అందించడంతో, అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.