'రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు': మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా గురువారం నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సేవా సంకల్ప్ పేరుతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతిలో తెలిపారు. అన్ని పీహెచ్‌సీల వద్ద నిర్వహించే ఈ శిబిరాల్లో ప్రజలకు వైద్యసేవలు అందించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పిస్తామని, హాజరయ్యే వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి 104 సంచార వైద్యశాలలతో అనుసంధానం చేస్తామని ఆయన పేర్కొన్నారు.