పేదలకు వైద్యం అందించడమే లక్ష్యంగా సపర్య ప్రాజెక్టు ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
హైదరాబాద్లోని తెలుగు ఫిలిం ఛాంబర్లో మనం సైతం ఫౌండేషన్ 13 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ సపర్య వుయ్ కేర్ ఫర్ అన్ కేర్డ్ నూతన ప్రాజెక్టును ప్రకటించారు. అనాథలు, ఒంటరి వృద్ధులు, పేదల కోసం అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, జనతా వైద్యం ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే సినీ కార్మికుల పిల్లలకు ఉచిత హాస్టల్ వసతితో పాటు నీట్, ఐఐటీ కోచింగ్ అందించనున్నట్లు వెల్లడించారు.