వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
రిపోర్టర్: గోపి
స్థలం: కామారెడ్డి
కామారెడ్డి జిల్లా చిన్నకోడబల్లిలో ఒక సమస్యపై మనస్తాపం చెంది వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని పిట్లం పోలీసులు ప్రాణాలతో రక్షించారని ఎస్పీ కామారెడ్డి వెల్లడించారు. బాధితుడు ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి క్షణాల్లో చేరుకున్న పోలీసులు, ఎంతో చురుగ్గా వ్యవహరించి సదరు వ్యక్తిని సురక్షితంగా కిందకు దించామని పేర్కొన్నారు. అనంతరం అతనికి కుటుంబసభ్యుల సమక్షంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి ధైర్యం చెప్పామని, ఆపదలో ఉన్న ప్రజలకు కామారెడ్డి జిల్లా పోలీసులు ఎప్పుడూ అండగా ఉంటారని ఎస్పీ కామారెడ్డి స్పష్టం చేశారు.