మనుబోలు మండలం గమళ్లపాలెంలో వైభవంగా అంజనేయ స్వామి పూజలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: మనుబోలు

మనుబోలు మండలం గమళ్లపాలెం కొదండరామపురంలో దసరా వేడుకల్లో భాగంగా అంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మనోజ్ కుమార్ శర్మ క్షీరా పంచమృతాభిషేకం, కుంకుమార్చన ఘనంగా జరిపించారు. దేవుడిని ప్రత్యేకంగా అలంకరించగా, నసిన రావణమ్మ, ఆమె కుమారుడు అనిల్ గౌడ్ కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి భజన కార్యక్రమం చేపట్టారు.