పొదలకూరులో వైభవంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా పొదలకూరు ఎమ్మార్వో కాలనీలో స్థానిక పీహెచ్సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారిణి డాక్టర్ కిరణ్ రిషిత నేతృత్వంలో ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తపోటు, మధుమేహాన్ని తొలిదశలో గుర్తించి చికిత్స పొందితే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చన్నారు. సబ్-యూనిట్ అధికారి అంజనేయ వర్మ పర్యవేక్షణలో వైద్య సిబ్బంది స్క్రీనింగ్, కౌన్సెలింగ్ సేవలు అందించారు.