జర్నలిస్టుల డిమాండ్ల సాధనకై పలాసలో ఏపీయూడబ్ల్యూజే నిరసన ప్రదర్శన

రిపోర్టర్: Dinesh panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాసలో గాంధీ జయంతి సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్ డే నిర్వహించారు. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం జర్నలిస్టుల రక్షణ చట్టం, ఆరోగ్య భద్రత, పెన్షన్ వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బ్యానర్లతో నిరసన తెలిపారు.