బెంగళూరులో దారుణం: అప్పు కోసం మహిళను కిడ్నాప్ చేసి చిత్రహింసలు
రిపోర్టర్: నరేష్
స్థలం: కర్ణాటక
బెంగళూరులో అప్పు తీర్చలేదన్న నెపంతో ఓ మహిళను కిడ్నాప్ చేసి నలుగురు వ్యక్తులు దారుణంగా హింసించారు. బాధితురాలిని నాలుగు రోజులు బంధించి, బలవంతంగా దుస్తులు విప్పించి వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తామని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదుతో రేష్మా బాను, సుహైల్, నజ్రత్ బేగం, సైఫ్లను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.